మాస్ కు కిక్కిస్తున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌

మాస్ కు కిక్కిస్తున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌

మాస్ కు కిక్కిస్తున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌

సాంగ్ చూసి ఎంజాయ్ చేస్తున్న అభిమానులు

లక్ష్మీ సౌజన్యను డైరక్టర్ గా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్‌ తో కలిసి సూర్యదేవర నాగవంశీ  “ వరుడు కావలెను” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ హీరోయిన్ రీతు వర్మ హీరోయిన్, యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి   నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌తో పాటు ఓ మెలోడీ సాంగ్‌కి మంచి రెస్పాన్స్  వచ్చింది. సాంగ్ ను చూసిన అభిమానులు దిగు దిగు దిగు నాగ అంటూ పాడుతూ కిర్రాకు పుట్టిస్తున్నారు.

ఈ సినిమాలో దిగు దిగు దిగు నాగ పాటకు శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రేయాఘోషల్ పాటను ఆలపించారు. ఈ సినిమాలోని పాటలకు తమన్ సంగీతాన్ని అందిచారు. తెలంగాణలో చాలా పాపులర్‌ అయిన ఫోక్‌ సాంగ్‌ దిగు దిగు దిగు నాగ’మాదిరి, చాలా హుషారుగా సాగే పాట ఇది. అట్లాగే  ‘కొంపకొచ్చిపోరో కోడెనాగ .. కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా’ వంటి పదప్రయోగాలు ఉపయోగించి తెలంగాణ బాణిని వాడుకున్నారు. మాస్ గుండెల్లో చెరగని ముద్రవేసేలా పాటల్ని రూపొందించారు శ్రీరామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *