ముంబైలో ఛార్మీ, పూరి మధ్య ఏమి జరిగిందో తెలుసా..?
ముంబైలో ఛార్మీ, పూరి మధ్య ఏమి జరిగిందో తెలుసా..?
పూరి జగన్నాథ్.. డేర్ అండ్ డాషింగ్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ డెఫినిషన్..పూరి కథాంశంలో ఒక ఆవేశం ఉంటుంది, పూరి పాత్రల్లో జీవితాలు ఉంటాయి. పూరి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. పూరి మాస్ ఎలిమెంట్స్ లో ఒక విజన్ ఉంటుంది. అందుకే.. ‘పూరి’ అనే పదమే ఒక స్టైల్ అయింది.
ముంబైలో ‘లైగర్’ చిత్రం షూటింగ్ కోసం పూరి, ఛార్మి మకాం మార్చారు. లైగర్ చిత్రంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. కరణ్ జోహర్ బాలీవుడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న పూరి, ఛార్మీలకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ అనుభవాన్ని స్వయంగా ఛార్మీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
‘లైగర్’ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ముంబైలో ఉన్నారు. అయితే వీరిరువురు ‘లైగర్’ షూటింగ్ కోసం పూరి, ఛార్మీ కారులో వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రమోద్ అనే కుర్రాడు వారిని చూసి ఎంతో అప్యాయంగా పలకరించాడు.
అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కారు రిజిస్ట్రేషన్ ఉండటంతో.. తెలుగు కుర్రాడైన ప్రమోద్..అందులో ఉన్న పూరి, ఛార్మీలను గుర్తుపట్టి చాలా సంతోషంగా నవ్వుతూ చార్మి, పూరిలను పలకరించాడు. నేను మీ అభిమానిని.. మీ సిగ్నచేర్ తో పాటు పూరితో సెల్ఫీ తీసుకోవాలని ఎంతో ఆరాటపడ్డాడు కానీ.. సమయానికి తన దగ్గర ఫోన్ లేకపోవడంతో నిరాశపడ్డాడు. అయితే నేను లైగర్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
పూరి ఆ కుర్రాడిని ప్రేమగా పలకరించి.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సన్నివేశాలను ఛార్మీ తన ఫోన్లో రికార్డు చేశారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో కారు ముందుకు సాగింది. ఆ కుర్రాడు ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సిందిగా ఛార్మీని కోరాడు. ప్రస్తుతం ఛార్మీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021