మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు 50 ఏళ్లు!

మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు 50 ఏళ్లు!

మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు 50 ఏళ్లు!

ఆలనాటి సినిమాల్లో అందగాళ్లకే అందగాడు సూపర్ స్టార్ కృష్ణ.. అయితే సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో 50ఏళ్లు పూర్తయ్యింది. తెలంగాణ, ఏపీలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు ఇండస్ట్రీలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ అంటున్న కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్

దేశ తెలుగు చరిత్రలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక, కౌబోయ్, జేమ్స్ బాండ్ చిత్రాలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అని చెప్పారు. ‘ఇండియన్ సిరీస్ పై తొలి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా పతాకంపై నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం 7 భాషలలో డబ్ చేయబడి 125 దేశాలలో ప్రదర్శింపబడింది.  ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల కేకులు కోసి, మిఠాయిలు పంచుకున్నారు. కొన్నిచోట్ల అవార్డులు కూడా ఇచ్చి సత్కరించుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *