యాప్ ద్వారా అద్దెకు సోనాలికా ట్రాక్టర్

యాప్ ద్వారా అద్దెకు సోనాలికా ట్రాక్టర్
రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇవ్వడం కోసం.. ‘సొనాలికా అగ్రో సొల్యూషన్స్’ ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ సామాగ్రితో పాటుగా ట్రాక్టర్లు, మెషినరీని కూడా ఈ యాప్ ద్వారా రైతులు అద్దెకు తీసుకోవచ్చని ‘సొనాలికా అగ్రో సొల్యూషన్స్’ తెలిపింది. అయితే రైతుల అవసరాలకు బట్టి మా యాప్ లో దొరికే యంత్రాలను అద్దెకు తీసుకోవచ్చని చెప్పింది. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం చేసుకోవడానికి సొనాలికా ట్రాక్టర్ ను ఇస్తున్నామని తెలిపారు. అందుకే ఈ డిజిటల్ యుగంలో రైతులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ యాప్‌ను పరిచయం చేశాం. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. రైతులు మేం ఇచ్చిన ఈ యాప్‌పై కావాల్సిన వాటిని అద్దెకు తీసుకొని, వినియోగించి వాటి పనితీరును పరిశీలించుకోవచ్చునని సొనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ ఫెసిలిటీ పెద్ద నగరాల్లో మాత్రమేనని.. త్వరలో దేశమంతా విస్తరిస్తామని రమణ్ మిట్టల్ తెలిపారు.