రైతులు.. రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి..

ఈ పథకంతో నెలకు రూ.3వేలు పొందే పెన్షన్ స్కీం
దేశ వ్యాప్తంగా రైతులకు ఈ స్కీం ఉపయోగం
60ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ.3వేల పెన్షన్
వృద్ధాప్యంలో ఉన్న రైతులను రక్షించేందుకు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేసే విధంగా రైతుల ఆర్థిక ప్రయోజనం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతలుగా రూ.2,000 పంపిణీ చేయనుంది.
ఇప్పటి వరకు 9 విడతలుగా రూ.18వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమకాగా ఇప్పుడు 10వ విడతకు సమయం వచ్చేసింది.
ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద, 60 ఏళ్ల వయసు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇప్పటికే మీరు PM కిసాన్ స్కీం దరఖాస్తు చేసుకుంటే.. ప్రస్తుత్తం ఎలాంటి ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఈ నియమ నిబంధన భూమి కలిగి ప్రభుత్వ ఉద్యోగి అయినట్లతే, లేదా రిటైర్డ్ అయితే వారికి ఈ నిబంధన వర్తించదు.