రైల్వే ప్రయాణికులకు IRCTC బంప్ ఆఫర్: 505

- వీకెండ్ లో టూర్ ప్లాన్
- IRCTC అందించే ఆఫర్ తో భాగ్యనగరం మొత్తం చుట్టేయండి
- టూరిస్టుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించిన IRCTC
కరోనాతో లాక్ డౌన్ లో ఎటూ తిరగలేక ఇంట్లోనే కూర్చొని బోరు కొట్టి.. హైదరాబాద్ లో ప్రదేశాలను చూడాలను కునే వారికి IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే దీనిలో భాగంగా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ప్యాకేజీలో భాగంగా ఒక్కరికి రూ.505 చెల్లించాలి. అయితే సిటీలోని ప్రదేశాల్నింటీని చూడోచ్చు.
ఈ ప్యాకేజీ సోమ, శుక్రవారం తప్ప మిగతా ఐదు రోజులు ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్యాకేజ్ బుక్ చేసుకున్న వారు ఒకరోజు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. దీనిలో భాగంగా ఉ.8 గంటల నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో టూర్ ప్రారంభవుతుంది. అయితే బయట ప్రదేశాల్లో తిరిగి చూసే వాటికి మాత్రం పర్యాటకులే ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రకటించిన IRCTC.
ప్యాకేజీలో భాగంగా ట్యాంక్ బండ్, సాలర్జంగ్ మ్యూజియం,చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు,చార్మినార్, గోల్కోండ, కులీబ్ కుతుబ్ షాహీ టూంబ్స్ లోని పరిసర ప్రాంతాల్లోని వాటిన్నింటిని ఎంజాయ్ చేయొచ్చు. IRCTC నిర్ణయించిన వివిధ ప్యాకేజీలలో 13 నుంచి 22 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.505గా చెల్లించాలి. ఒకవేల 7 నుంచి 12 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,145, మరో ప్యాకేజీ లో 4 నుంచి 6గురు బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,170 చెల్లించాలని హెరిటేజ్ హైదరాబాద్ నిర్ణయించింది.