“సందేశ్” అంటే..!

“సందేశ్” అంటే..!
  • వాట్సప్ కు పోటీగా సందేశ్ యాప్
  • ప్లే స్టోర్ లో సందేశ్ యాప్ లభ్యం

వాట్సాప్ ఆన్ లైన్ మేసేజింగ్ యాప్ కు పోటీగా కేంద్రం ఓ కొత్త యాప్ ను లోక్ సభలో కేంద్ర సహాయ శాఖ మంత్రి చంద్రశేఖర్ విడుదల చేశారు. దీనికి “సందేశ్” యాప్ గా నామకరణం చేశారు. సందేశ్ యాప్ కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. అయితే ఈ యాప్ వాట్సాప్ కు పోటీగా నిలుస్తుందని చెప్పొచ్చు.

వాట్స్ ప్ లో ఓన్లీ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అయితే ఈ యాప్ యొక్క మరో విశిష్టత ఏమంటంటే మొబైల్ నెంబర్ తో పాటు Email ఐడీతో యాడ్ చేసుకునే విధంగా సందేశ్ యాప్ ను డిజైన్ చేశారు. ఈ యాప్ లో 50మందిని యాడ్ చేసుకోవచ్చు. ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రమే వాడుతుండేవారు. ఇప్పుడు  అందరూ వాడుకునేలాగా యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.

సందేశ్ యాప్ ను నేషనల్ ఇన్ఫోర్ మెటిక్ సెంటర్ (NIC) ఢిల్లీ, కేంద్ర ఐటీ వింగ్ కలిసి తయారు చేశాయి. ఈ సందేశ్ యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి కూడా డోన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తోంది. ఆ ఓటీపీని మరలా ఎంట్రీ చేస్తే సందేశ్ యాప్ ను మనం వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *