శ్రావణ మాసం పండుగలు ప్రత్యేకతలు

శ్రావణ మాసం పండుగలు ప్రత్యేకతలు

శ్రావణ మాసం పండుగలు ప్రత్యేకతలు

శ్రావణ మాసం హిందువులకు ప్రత్యేకమైన మాసం

శుభ కార్యాలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనువైన మాసం శ్రావణం

భారత దేశంలో హిందువులకు ప్రత్యేక పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసం   హిందువులకు ప్రత్యేకమైన మాసంగా చెప్పొచ్చు. ఈ మాసం శుభ కార్యాలకు అనువైన మాసం శ్రావణ మాసం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పెళ్లైన కొత్త జంటలు పూజలు చేసుకునే మాసం శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. క్యాలెండర్ ప్రకారం ఈనెల 9వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది.

ఈ మాసంలో తొలుతగా వరలక్ష్మీ వ్రతం తరువ్వాత తులసీదాస్ జయంతి, వినాయక చతుర్థి, నాగ పంచమి, భాను సప్తమితో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు పండుగలు వచ్చాయి.

హిందువులు ప్రతి పండుగను వాళ్ల సంప్రదాయంలో ఒక్కోరీతిలో చేస్తుంటారు. సోమవారం అంటే శివుడుకి ఎంతో ప్రీతికరమైన రోజు, అందుకే ఈ శ్రావణ మాసంలో హిందువులు సోమవారాలన్నింటినీ చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే మహాశివరాత్రినాడు పరమశివుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వపత్రం, క్షీరం, పాలాభిషేకం, పండ్ల రసాలతో అభిషేకంతో ప్రత్యేక పూజలు చేస్తారు. చివరి సోమవారం నాడు శివపార్వతులను పూజిస్తారు. అదే విధంగా ముత్తైదువులు శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. తమలపాకులు, వక్కలు, శనగలు, కాటుక, చలిమిడితో వాళ్ల నోముల్ని ముత్తైదువులకు వాయినాలిస్తారు.

నాగపంచమి: శ్రావణ మాసంలో నాగ పంచమికి ఎంతో ప్రత్యేక ఉంది. చాలా హిందువులకు పవిత్రమైన రోజు. ఆరోజు పుట్టలో నాగు పాములకు పాలు పోస్తారు. శ్రావణ మాసంలో నాగ పంచమి రోజున నాగ దేవతను కొలుచుకుంటారు.

శ్రీకృష్ణుడు కాళీ మర్ధనం చేసింది ఇదే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సమస్త లోకానికి సర్పాలు చేస్తున్న మేలుకి బదులుగా నాగ పంచమి రోజున పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరుకున్నాడని శాస్త్రాలలో చెబుతున్నారు.ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ పరమ శివుడే పార్వతీ దేవీకి వివరించినట్లు పురాణాల్లో చెప్పబడ్డాయి. నాగ పంచమిని ఎలా జరుపుకోవాలో శాస్త్రాల్లో పండితులు క్షుణ్ణంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *