శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ అందించింది. గత కొంత కాలంగా కరోనాతో నిలిపేసిన సర్వదర్శనాలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన టీటీడీ. సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ చేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా రోజుకు 2వేల టికెట్లను తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ లో కౌంటర్లలో టోకెన్లు భక్తులకు అందిస్తామని తెలిపింది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది.

అయితే ప్రతి నెలా ఆన్ లైన్ విడుదల చేస్తున్న రూ.300 టోకెన్లను నిమిషాల్లో అయిపోతుండడంతో భక్తులు ఎప్పటి నుంచో మళ్లీ నేరుగా వచ్చి సర్వ దర్శనం చేసుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మళ్లీ సర్వ దర్శనం టోకెన్ల జారీ మొదలు పెట్టబోతున్నట్టు టీటీడీ ప్రకటించింది. విడతల వారీగా  దర్శనానికి అనుమతి కలిస్తామని….భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులందరూ సహకరించాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: