సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్

సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్, దసరా బోనస్

సింగరేణి లాభాల్లో 29% వాటా ఇవ్వాలని నిర్ణయం

పండుగకు ముందే బోనస్ అందజేయాలని ఆదేశం

ఇతర ఖనిజాలపై సంస్థ దృష్టి పెట్టాలని సూచన

రిటైర్డ్‌ కార్మికులకు సహాయంపై సీఎం హామీ

తెలంగాణ వ్యాప్తంగా సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్..తెలంగాణ కార్మికులకు ఈ ఏడాది(29%)అంటే రూ.72, 500 బోనస్ చెల్లించే విధంగా ఈ మేరకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాదిలో కార్మికులకు రూ.68,500 బోనస్ ను సింగరేణి యాజమాన్యం చెల్లించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది సింగరేణి యాజమాన్యం. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి  చేకూరనుంది.

అయితే ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై ఈసారి నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (PLR)రూ.72,500 చెల్లించాలని అంగీకరించాయి. గత ఏడాది కంటే 1% (ఒకశాతం) పెంచుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరా పండుగకంటే ముందే చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ను కేసీఆర్ ఆదేశించారు.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి  తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరింప చేయాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణ వాప్తంగా ఉన్న బొగ్గు నిక్షేపాల తవ్వకాలతోపాటుగా ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సీఎం కీర్తించారు. కార్మికులు నిబద్దతతో నిరంతరంగా కృషి చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

అయితే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రిటైర్డ్ సింగరేణి కార్మికుల సేవలను వినియోగించుకునేలా సింగరేణి యాజమాన్యం యోచన చేస్తోంది. బొగ్గుతో పాటుగా ఇతర మైనింగ్ రంగాలలో కార్మికులను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *