సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ..61 ఏళ్ల పై ఉత్తర్వులు

సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ..61 ఏళ్ల పై ఉత్తర్వులు

సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ..61 ఏళ్ల పై ఉత్తర్వులు

గతంలోనే సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని.. సింగరేణి ఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సింగరేణిలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అందరికీ  ఈ పెంపు వర్తిస్తుందని సింగరేణి అధికారులు తెలిపారు. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులు ఈనెల 31లోపు విధుల్లో చేరాలని తెలిపారు. రిటైర్మెంట్ ఏజ్  పెంపుతో సింగరేణిలో పనిచేస్తున్న 43,899 మందికి ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: