సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ వారిగురించి స్మరించుకొన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్ది గలవారు ఉపాధ్యాయులేనని అన్నారు. సంఘంలో విద్యార్థుల్ని బాధ్యతగల పౌరులుగా తయారుచేసే ఉపాధ్యాయుల పాత్ర సేవలు వెలకట్టలేనివని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

అయితే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అత్యధికంగా గురుకులాలు నెలకొల్పి, విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విద్య దేశానికే తలమానికంగా రూపుదిద్దే మహాయజ్ఞంలో సంపూర్ణ భాగస్వాములు చేసేందుకు గురువులు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ కోరారు.

గత కొంత కాలంగా కరోనాతో నిలిచిపోయిన స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభమైనందున కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ, విద్యార్థులకు బోధనతో పాటుగా చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, విద్యనందించాలని గురువులను సీఎం కేసీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *