స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్ పీవీ సింధు

స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్  పీవీ సింధు
  • స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్  పీవీ సింధు
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికిన అభిమానులు
  • టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి వచ్చిన సింధూ

సింధూకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కోలాహలం మధ్య సింధూకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధూ.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకాన్ని సాధించింది. ఇండియాలో రెండో ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.

 టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బాడ్మింటన్‌ విభాగంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు కాంస్య పతకం సాధించి స్వదేశానికి వచ్చిన పీవీ సింధూను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. పీవీ సింధు కాంస్యం సాధించడానికి కృషి చేసిన ఆమె కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర  మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *