హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల ఖరారు
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల ఖరారు
టీఆర్ఎస్ పార్టీతో విబేధాలు రావడంతో రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. టీఎర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈసారి యువతరానికి ఛాన్స్ ఇచ్చాయి ఈ పార్టీలు. అయితే తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలో దింపుతున్నామని అధికారికంగా ప్రకటించింది. హుజురాబాద్ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరీ వెంకట్ చేస్తుండగా, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అనుకున్న విధంగానే బీజేపీ నుంచి ఈటలను ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక జరగబోతున్నది. అయితే ఈ మూడు పార్టీలు తమ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే మరీ..