హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత

దేశ వ్యాప్తంగా ఉన్న హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నసంగతి తెలిసిందే. అయితే ఐటీ శాఖ జరిపిన సోదాల్లో లెక్కకు మించిన ఆదాయం ఉండటంతో ఐటీ శాఖ దేశ వ్యాప్తంగా  ఉన్న 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్ధల్లో ఐటీ దాడులు జరిగాయి..రూ.142 కోట్ల నగదు సీజ్ చేయడంతో పాటుగా రూ.550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు ఐటీ అధికారులు.

ఐటీ జరిపిన సోదాల్లో వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారని..బీరువాల్లో రూ.500నోట్ల కట్టలేనని మనీ ఉందని, పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను సీజ్‌ చేశామని ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచి పెట్టినట్లు గుర్తించామని.. ప్రజలు ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వల పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారని మీడియాకు వెల్లడించిన ఐటీ అధికారులు. లెక్కకు మించిన డబ్బును ఇనుప, చెక్క అల్మారాల్లో డబ్బును సరిపోనప్పటికీ మరీ మరీ కుక్కిపెట్టారని, ఒక్కోక్క ఐరన్ అల్మారాలో 5 కోట్ల నగదు దాచారని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న హెటిరో సంస్థల్లో జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బులను లెక్క పెట్టేందుకు    2 రోజుల సమయం పట్టిందని దీంతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకులలో పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *