100 ఏళ్ల కల… భారత్ కు స్వర్ణం

100 ఏళ్ల కల… భారత్ కు స్వర్ణం

100 ఏళ్ల కల… భారత్ కు స్వర్ణం

ప్రపంచ చరిత్రలో ఇండియా 100ఏళ్ల కలను సాకారం చేశాడు 23ఏళ్ల నీరజ్ చోప్రా. టోక్యోలో భారత త్రివర్ణ పతాకాన్ని మరోసారి ఎగరేసి దేశం గర్వపడేలా చేశాడు నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో ఫైనల్లో స్వర్ణం సాధించాడు.టోక్యో ఒలింపిక్స్ లో వచ్చిన ఏకైక బంగారు పతకం ఇదే. అథ్లెట్ నీరజ్ చోప్రా ఆడిన తీరు అధ్బుతం అని చెప్పొచ్చు. 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ అండ్ ట్రాక్ విభాగంలో బంగారు పతాకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించారు.

తొలి రౌండ్ లో 87.03 మీటర్లు, రెండో రౌండ్ 87.58మీట్లరు, మూడో రౌండ్ లో 76.79 మీటర్లు చొప్పన విసిరి టాప్ పొజీషన్ కి వెళ్లాడు నీరజ్. 4,5 రౌండ్లలో నీరజ్ తీవ్ర ఒత్తిడికి గురై ఈ రౌండ్లలో ఫౌల్ అయ్యాడు. జావెలిన్ విసిరే సమయంలో లైన్ దాటి ముందుకు అడుగేసాడు. 4,5 రౌండ్లు ఫౌల్ అవ్వడంతో లెక్కలోకి రాకుండా పోయాయి. ఆరో రౌండ్ లో 84.25 మీటర్లు విసిరాడు. ఓవరాల్ గా మనోడే టాప్ లో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

చోప్రా హిస్టరీ:  హర్యానా, హనిపట్ జిల్ ఖాంద్రాలో 1997 డిసెంబర్ 24న జన్మించారు. చోప్రా ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. ఛండీగఢ్ డీఏవీ కాలేజ్ చదివాడు. 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం, 2018 ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించి భారత్ కు పెరందించాడు నీరజ్ చోప్రా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *