101 జిల్లాల అందగాడులో అవసరాల

101 జిల్లాల అందగాడులో అవసరాల

101 జిల్లాల అందగాడులో అవసరాల  

అవసరాల శ్రీనివాస్ తనకంటూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన అవసరాల శ్రీనివాస్  ఇప్పుడు కథానాయకుడిగానూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బట్టతల ఉండే యువకుడి పాత్రలో “అవసరాల” నటించగా,  ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు.

రాచకొండ విద్యాసాగర్‌ డైరక్షన్ లో అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆగ‌స్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ సినిమాకు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: