10వ తరగతి పాసయ్యారా.. ఆ శాఖలో ఉద్యోగాలున్నాయి

10వ తరగతి పాసయ్యారా.. ఆ శాఖలో ఉద్యోగాలున్నాయి

10వ తరగతి పాసయ్యారా.. ఆ శాఖలో ఉద్యోగాలున్నాయి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

10వ తరగతి, ఇంటర్ పాసయ్యారా.. అయితే మీకే ఉద్యోగం

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్…పోస్టల్ సర్కిల్లో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notifications) విడుదలైంది. అభ్యర్థులు దీని ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ(LTC), పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ తదితర ఉద్యోగాల భర్తీ పూర్తి చేయనుంది. (10th) టెన్త్, (Inter) ఇంటర్ పాసయితే చాలు ఈ పోస్టల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ సెప్టెంబర్ 24 వరకు మాత్రమే ఉంది.

పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ విభాగాల్లో పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టుకు కనీస ఉత్తీర్ణత ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. MTS ఉద్యోగానికి అప్లై చేయాలంటే 10వ తరగతి పాసైతే చాలు. ఈ ఖాళీలన్నీ స్పోర్ట్స్ కోటాలో (Sports quota) పూర్తి చేయనున్నారు.

ఆయా శాఖలోని వివరాలు: పోస్టల్ అసిస్టెంట్ 11, సార్టింగ్ అసిస్టెంట్ 8, పోస్ట్ మ్యాన్, మెయిల్గార్డ్ 26, ఎంటీఎస్ (MTS) 10 పోస్టులున్నాయి.

అభ్యర్థులకు నిబంధనలు ఇవే!
ఈ నిబంధనల ప్రకారమే అభ్యర్థులు అప్లై చేయాలని సూచించిన పోస్టల్ శాఖ. పోస్ట్ మ్యాన్ జాబ్ (Postman jobs) కు అర్హత పొందితే రెండేళ్లలోగా టూ వీలర్, లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణలో పోస్టింగ్ కాబట్టి పోస్ట్ మ్యాన్,మెయిల్గార్డ్, ఎంటీఎస్ (MTS) కోసం దరఖాస్తు చేసే వారికి తెలుగు భాష రాయడం, చదవడం రావాలి. దీనితో పాటుగా తెలుగు భాష పై పట్టుండాలి. (స్పోర్ట్స్) ఆటల విభాగంలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్న కారణంగా సంబంధిత క్రీడల్లో అభ్యర్థులు అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి.. దీనితో పాటుగా   సర్టిఫికెట్లు కలిగియుండాలి.

అభ్యర్థులకు వయో పరిమితి
పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసేవారు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి(Ex: టెన్త్ లో డేటా బర్త్ ) లోకల్ ఏరియా, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము.

పోస్ట్ మ్యాన్, మెయిల్గార్డ్, ఎంటీఎస్(MTS)కు అప్లై చేసే వారు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (OBC) అభ్యర్థులకు మూడేళ్లు, SC, ST అభ్యర్థులకు 5 ఏళ్ల  వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ ఖాళీ వివరాలు తెలంగాణ పోస్టల్ ఆఫీసులో మాత్రమే.. ఆఖరు తేదీ: సెప్టెంబర్ 24 వరకు tsposts.in/sportsrecruitment వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  Official Website: https://tsposts.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *