ఖైరతాబాద్ లో ఈనెల 19వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ లో ఈనెల 19వరకు ట్రాఫిక్ ఆంక్షలు
భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని వినతి
Metro,MMTS లలో రావాలని ఆంక్షలు
ఈనెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు.దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది. దీంతో చేసేది ఏమీలేక ట్రాఫిక్ పోలీసులు ఈనెల 19వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణనాథుడ్ని చూసేందుకు వచ్చే భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని.. Metro, MMTSలలో రావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. HMDA పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాలని చెబుతున్నారు. గణనాథుడ్ని చూసేందుకు వస్తున్న వృద్ధులు, నడవలేని వారి వాహనాలను మింట్ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చామని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. ఖైరతాబాద్ మెయిన్ రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి…భక్తులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. కాగా ఈ ఏడాది 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. గణనాథుడ్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ సోషల్ డిస్టెన్స్ తోపాటుగా మాస్క్ లు, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని పోలీసులు సూచన. కరోనా నేపథ్యంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు.