ఇకపై కొత్త బైకు కొనే వారికి రెండు హెల్మెట్లు ఉండాల్సిందే…!

ఇకపై కొత్త బైకు కొనే వారికి రెండు హెల్మెట్లు ఉండాల్సిందే…!

ఇకపై కొత్త బైకు కొనే వారికి రెండు హెల్మెట్లు ఉండాల్సిందే…!

మీకు బైకు ఉందా.. లేక మీరు కొత్త బైకు కొందామని అనుకుంటున్నారా..మీకు హెల్మెట్ ఇచ్చారా..మీరు బైకు కొంటే కొత్త హెల్మెట్లు ఇచ్చారా.. మీరు లిప్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా.. అయితే ఇకపై జాగ్రత్త మరీ.. అయితే మీకో శుభావార్త అండీ..

మనలో ఎంతోమందికి తెలియని విషయం ఏమటంటే.. మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని.. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) చట్ట ప్రకారం.. టూవీలర్ వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన నిబంధనల ప్రకారం.. రెండు హెల్మెట్లను కస్టమర్లకు చట్ట ప్రకారం అందించాలని ఉంది.

అయితే ఈ నిబంధనల ప్రకారం మనం కొత్త బైక్‌ ఎక్కడ కొంటున్నామో.. ఆ కంపెనీ యాజమాన్యం నుంచి కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాల్సిందేనని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఆయా కంపెనీల యాజమాన్యాలు హెల్మెట్లు అడిగినా ఇవ్వకపోతే వెంటనే బైకు కొన్న వాహనదారులు వినియోగదారుల ఫోరమ్‌, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.

అయితే గతంలో BSI (బీఎస్ఐ) ప్రమాణాల ప్రకారం సూచించిన (ISI) ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు.. వాహనాదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది. అయితే ఈ నియమాలు ఎలక్ట్రికల్ వాహనాలకు కూడా నిబంధనలకు లోబడి వర్తిస్తాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *