30 నిమిషాల్లోనే వయో వృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శనం

30 నిమిషాల్లోనే వయో వృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శనం

వయో వృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శనం 

బ్యాటరీ కారులో వృద్దులను తరలింపు 

లడ్డూలు ఎన్ని కావలంటే అన్ని ఇస్తామన్న టీటీడీ 

వయస్సు మళ్లిన వారికి శుభవార్త చెప్పిన టీటీడీ. వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్స్ 60+) ఏడుకొండల స్వామి దర్శనాన్ని ఉచితంగా కల్పించనుంది టీటీడీ. ఈ వయో వృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించేలా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల తరువాత వయో వృద్ధులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని..సాయంత్రం 3 గంటల సమయం తరువాత వారికి ఉచిత దర్శన సౌకర్యం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది.

60ఏళ్లు దాటినట్లు ఆధార్ కానీ, లేక సీనియర్ సిటిజన్ ఆధారాలు చూపించాల్సి ఉంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ పత్రంలో ఫోటోతో వున్న వయసు నిర్ధారణ, పత్రాలు స్వామి వారి “S-1 Counter” వద్ద చూపించాల్సి ఉటుందని టీటీడీ తెలిపింది. క్యూలైన్లో వేచి ఉండాల్సిన పని లేదని, వాళ్లతో పాటుగా మెట్లు ఎక్కాల్సిన పని లేదని….స్వామి వారి ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే ఉన్న స్వామి వారి దర్శన మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

స్వామి దర్శనం తరువాత వయో వృద్ధులకు ఉచితంగా సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తామని తెలిపింది. వృద్ధులకు Rs.20/-లకు రెండు లడ్డూ టోకెన్లు ఇస్తారని… తరువాత Rs.25/- లకు ఒక లడ్డు చొప్పున.. ఎన్నైనా టోకెన్లు ఇస్తారని ప్రకటించిన టీటీడీ. లడ్డూ కౌంటరు నుండి బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. వయోవృద్ధుల దర్శనం కొరకు మిగతా అన్నీ క్యూ లు నిలిపేస్తామని తెలిపింది. ఆసమయంలో ప్రశాంతంగా వయోవృద్ధులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఆ సమయంలో స్వామిని దర్శించుకునే దగ్గర ఎటువంటి ఒత్తిళ్ళు-తోపులాటలు ఉడవని టీటీడీ తెలిపింది. వయోవృద్ధులకు 30 నిమిషాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి అవుతుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: