సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో ఇదే తొలిసారిగా 9మంది సుప్రీంకోర్టు జడ్జిల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ఒకేరోజు 9 మంది న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయస్థానం చరిత్రలో తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ప్రమాణం చేసిన ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జేకే మాహేశ్వరి, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయించారు.

9మంది న్యాయమూర్తులో ప్రమాణస్వీకారం చేయగా.. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మహిళా న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేది.

గతంలో కొలిజియం పంపిన 9 మంది న్యాయమూర్తుల పేర్లను ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈసారి ప్రమాణ వేదికను.. అదనపు భవనంలోని ఆడిటోరియంలో జడ్జిన ప్రమాణం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: