సుప్రీంకోర్టు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

 సుప్రీంకోర్టు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

 సుప్రీంకోర్టు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియమాకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వీరిని నియమిస్తూ ‘వారంట్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్’పై సంతకం చేశారు. ఈనెల 18న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బార్ బెంచ్ కి ఒకరు, ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కలిపి మొత్తం 9 మంది కొత్త జడ్జీల నియామకానికి సిఫారసు చేయడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే ప్రస్తుతం 24 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఈ కొత్త నియామకాలతో అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జిల సంఖ్య 33కు చేరుతుంది. ఒక జడ్జి పదవి మాత్రమే ఖాళీగా ఉంటుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన మహిళలు… జస్టిస్ హిమ కొహ్లి (తెలంగాణా హైకోర్టు), జస్టిస్ బెలా ఎం త్రివేది (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్టు) అత్యున్నత న్యాయస్థానానికి ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు నియమితులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొత్తగా నియమితులైన 9మందిలో సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ (సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్), జస్టిస్ ఎంఎం సుందరేశ్ (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్ హైకోర్టు),జస్టిస్ ఏఎస్ ఓఖా (కర్ణాటక హైకోర్టు), జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కిం హైకోర్టు), జస్టిస్ సీటీ రవి కుమార్ (కేరళ హైకోర్టు) ఉన్నారు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీలలో నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.

అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే, ఈ తొమ్మిది మందిలో ఇద్దరు తెలుగువారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *