ఆప్ఘనిస్థాన్: మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!

ఆప్ఘనిస్థాన్: మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది…మరోవైపు దాడులు, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడం..అక్కడి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతో పాటుగా అక్కడి ప్రజలన్ని ఇంటింకి భయభ్రంతాలకు గురిచేస్తున్నారు. దీంతో పాటుగా ఆత్మాహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. తాజాగా మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ రక్తమేరులైపారింది. కుందుజ్‌లో మసీదును టార్గెట్ చేసి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 100మందిపైగా మృతిచెందగా..చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆ సమయంలో మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. క్షతగాత్రుల్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాది సంస్థ తామేనని ప్రకటించలేదు.

మా అంచనా ప్రకారం ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నామని..సమాచార డైరెక్టర్ మతియుల్లా రోహాని తెలిపారు.ఆగష్టు నెలఖారికి అమెరికా మరియు నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలిబాన్లు దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడక్కడ డజన్ల కొద్దీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనిపై వార్తలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. దీనిలో భాగంగా మసీదులోని ప్రార్థనలు చేస్తున్న వారిని టార్గెట్ చేసిన తాలిబన్లు..ఈ  మారణహోమమే అతిపెద్దదిగా చెబుతున్నారు. మసీదు లోపల శిథిలాల కింద పదుల సంఖ్యలో మృతదేహాలు చిక్కుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక, మృతదేహాలు, బాధితుల ఆర్తనాధాలతో కుందుజ్ ప్రావిన్షియల్ హాస్పిటల్‌కు భయంకర పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలో అక్కడి ప్రజలు తో సహా ఆర్మీ సిబ్బంది పాల్గొన్నాయి. తమ బంధువుల కోసం ఎంతో మంది ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఏ కబురు వినాల్సి వస్తోందనని భయపడుతున్నారు అక్కడి ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *