Afghanistan: ఎయిర్ పోర్టులో వాటర్ బాటిల్ రూ.3వేలు, ప్లేట్ మీల్స్ రూ.7వేలు  

Afghanistan: ఎయిర్ పోర్టులో వాటర్ బాటిల్ రూ.3వేలు, ప్లేట్ మీల్స్ రూ.7వేలు  

ఆఫ్గానిస్తాన్ ఎయిర్ పోర్టులో వాటర్ బాటిల్ రూ.3వేలు, ప్లేట్ మీల్స్ రూ.7వేలు  

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అక్కడి ప్రజలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.  ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాశ్రయాల దగ్గర రోజుల తరబడి వేచి చూస్తున్నారు. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు అరాచకం అంతా ఇంతా కాదు. అయితే కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని వైపులా మార్గాలను మూసివేశారు. దీంతో అక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఎయిర్ పోర్టులో ఉన్న విదేశీయులుతో సహా ప్రయాణికులు ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎయిర్ పోర్టులో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు చేరింది. ఒక ప్లేట్‌ రైస్‌కు వంద డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.7500) ఖర్చు చేసి మరీ కొనుకుంటున్నారు.

ఎయిర్ పోర్టులో ఆఫ్గానిస్తాన్ కరెన్సీని వినియోగంలోకి లేదు. అమెరికన్ డాలర్లు మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడి ఆఫ్గానిస్తాన్ ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ప్రయాణికులు ఆహారం, నీళ్లు లేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరో వైపు చిన్నారులకు కూడా పాలు, బిస్కెట్లు లేక పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం విమానాశ్రయం దగ్గర పడిగాపులు కాస్తున్న ప్రజలు.. దాదాపు 50వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఏదో విధంగా ఆఫ్గానిస్తాన్‌ నుంచి బయటపడేందుకు ఎయిర్ పోర్టుకు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఇందులో కొంత మందిని మాత్రమే ఎయిర్ పోర్టులోనికి అనుమతి ఇస్తున్నారు. వేలాది మంది ప్రజలు ఎయర్ పోర్టు బయటనే నిరీక్షిస్తున్నారు. అందరినీ ఎయిర్ పోర్టులోనికి అనుమతించకపోవడంతో బయటే పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా తాలిబన్ రాజ్యం నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: