సైనికుల మృతిపట్ల జోబైడెన్ ఆగ్రహం… ప్రతీకారం తీర్చుకుంటాం

సైనికుల మృతిపట్ల జోబైడెన్ ఆగ్రహం.. ప్రతీకారం తీర్చుకుంటాం
ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు దగ్గర ఘటనలో అమెరికా సైనికులు 13మంది చనిపోవడంపై ఆయన ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. అయితే మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. అయితే దాడికి పాల్పడింది మేమేనని ఇస్టామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే మా సైనికులను హతమార్చిన ఐసిసిస్ ను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. అయితే ఈ మారణహోమంలో 75మందికి పైగా మృతి చెందారు. 200మందిపైగా గాయాలపాలయ్యారు.
ఈనెల 31 కల్లా అమెరికా సైన్యం ఖాళీ చేయాలంటూ తాలిబన్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఆ ఘటనలో ఆఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని తెలిపారు. కానీ ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో తమ సైన్యాన్ని అక్కడే ఉంచి తమ సైనిక బలగాలను హతమార్చినవారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన అన్నారు. ఇదే ఘటనపై ఐక్యరాజ్యసమితి కూడా ఘండించింది.