పంజ్‌షీర్‌ సైన్యం ఎదురు కాల్పుల్లో 300మంది తాలిబన్లు హతం..!

పంజ్‌షీర్‌ సైన్యం ఎదురు కాల్పుల్లో 300మంది తాలిబన్లు హతం..!

పంజ్‌షీర్‌ సైన్యం ఎదురు కాల్పుల్లో 300మంది తాలిబన్లు హతం..!

ఆఫ్గానిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఆనాటి నుంచి  ఆఫ్గానిస్తాన్ లో పరిస్థితులు భయానకరంగానే ఉన్నాయి.. తాలిబన్లు ఆక్రమణతో చివరికి దేశం విడిచి దేశాధ్యక్షుడే పారిపోయాడు. అంటే దీని బట్టి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆఫ్గానిస్తాన్ సైన్యం  తాలిబన్లకు లొంగిపోయింది. అయితే ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన అక్కడి ప్రజలు, ఉద్యోగాలు చేసేందుకు వచ్చిన ప్రజలు..భయంతో విదేశాలకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతూ ఎయిర్ పోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తానిబన్ల సైన్యం ప్రతిఘటించినప్పటీకీ అక్కడికి వెళ్లేందుకు చాలా ప్రయాత్నాలు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల రాజ్యం ఏలుతోంది..దీనిలో భాగంగా పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ లో తాలిబన్ల అరాచకం ఎక్కువైయింది.

పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ను ఆక్రమించేందకు యత్నించిన తాలిబన్లను.. ఆఫ్గానిస్తాన్ వర్గానికి చెందిన పంజ్‌షీర్‌ సైన్యం హతమార్చినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను పంజ్‌షీర్‌ సైన్యమే హతం చేసినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. దీనిలో బాగంగా బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి పంజ్‌షీర్‌ సైన్యం కైవసం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఇదే క్రమంలో తిరగబడిన సైన్యాన్ని హతం చేసేందుకు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదలి వెళ్లినట్లు సమాచారం. పంజ్‌షీర్‌ సైన్యం  పలువురు తాలిబన్లను అరెస్ట్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇందుకు భిన్నంగా ఆఫ్గానిస్తాన్ ప్రజలు, పంజ్‌షీర్‌ ప్రజలు తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని ప్రకటించారు. అయితే పంజ్‌షీర్‌ ఫ్రావిన్స్ లోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేసింది పంజ్‌షీర్‌ సైన్యం. ప్రస్తుతం తాలిబన్ల చెర నుంచి అఫ్గానిస్తాన్ విముక్తి చేసేది విధంగా అహ్మద్ షా మసూద్ ఆధ్వర్యంలో పంజ్‌షీర్‌ సైన్యము పనిచేస్తోందని అక్కడి ప్రజలు బాగా నమ్ముతున్నారు.+

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *