తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్

తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్
ఆఫ్గానిస్తాన్ లో కొనసాగుతున్న హింస
చర్చలు జరుపుతున్న ఆఫ్గానిస్తాన్, తాలిబన్లు పెద్దలు
తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అఫ్గానిస్తాన్ భూభాగాలపై ఒకేసారి తన సైన్యంతో అధీనంలోకి తెచ్చుకుంటున్న తాలిబన్ సేనలు తాజాగా రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాయి. ముజాహిదీన్ నగరంలోని అమరవీరుల స్క్వేర్కు చేరుకున్నామని తాలిబాన్ ప్రతినిధి ట్వీట్టర్ ద్వారా తెలియచేసారు. దీనిలో భాగంగానే గవర్నర్ బంగ్లాతో సహా ఇతర భవనాలతో ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని అంతర్జాతీయ మీడియా మీడియా ద్వారా తాలిబన్ ప్రకటన ఇచ్చింది.
ఓ పక్క హింస వద్దంటూ… మరో ప్రక్క తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమని అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తాలిబన్ల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.
సఖ్యతపై అధికారికంగా తాలిబన్లు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్ఘానిస్థాన్ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు. తాలిబన్ల ప్రతిస్పందన కోసం ఆఫ్గానిస్తాన్ ఎదురుచూస్తోంది.