ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల తీరుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్

ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల తీరుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్

 ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల తీరుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్

అఫ్గానిస్తాన్ అధ్యక్షభనంలో తాలిబన్ల తీరుపై మండిపడ్డ రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ అంటేనే స్పెషల్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆర్జీవీ సాటి లేరు ఎవరు.. అయితే తాలిబన్ల అరాచకాలపై మనస్సు విప్పిన రామ్ గోపాల్ వర్మ. ఈ వివాదాస్పద డైరెక్టర్ ఎప్పుడు, ఏం అంశంపై, ఎలా స్పందిస్తారో ఆయనకే తెలియదు. ఏ విషయాన్నినైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు ఆయనే సాటి.

తాజాగా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ఆర్జీవీ తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్నఆఫ్గానిస్తాన్ పరిస్థితులపై స్పందించారు. తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించిన ఆర్జీవీ…ఆఫ్గానిస్తాన్  అధ్యక్ష భవనంలో తాలిబన్లు ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న వీడియోని షేర్‌ చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులో చెప్పాల్సిన అవసరం లేదని..దీని బట్టే వాళ్లు ఎంతటి వాళ్లో అని ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్‌ చేశాడు.

అలాగే తాలిబన్లు ఎమ్యూజ్ మెంట్ పార్కుకి వెళ్లి చిన్న పిల్లల్లా ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘ఇది నిజం.. తాలిబన్లు “జస్ట్ కిడ్స్’ అంటూ ఆర్జీవీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *