ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయొచ్చా….?

మన హిందూ సంప్రదాయంలో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు పూజలు చేయకూడదని చెబుతుంటారు. ఇది ఒక ఆచారం అని.. ఇది ఎప్పటి నుంచో వస్తున్నదని చెబుతుంటారు. పెద్దతరం వారిలో కొందరూ దీన్నీ ఏకభవిస్తున్నారు. మరికొందరూ ఏడాది పాటు వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు.., దేవతా మూర్తుల చిత్రపటాలను ఒక బట్టలో చుట్టి, ఇంట్లో ఎవరూ కదలించని ప్రదేశంలో పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజలు చేయడం మొదలు పెడతారు.

మన హిందూ శాస్త్రాలలో ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.. అయితే కొంతమంది కుటుంబ సభ్యులలో వ్యక్తులు మరణించిన తరువాత ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవారాధన, నివేదన చేయరాదని చెబుతుంటారు. కొందరు చేయమని చెబుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏ శాస్త్రంలో ఇలా చెప్పలేదు.

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన, దైవారాధన అనేది జరగాలి. మరణాంతరం మనం తెలిసి తెలియక మన ఇంట్లో అన్నీంటిని తాకుతాం. అప్పుము మైలు అవుతుంది. కావున 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం శాస్త్రోత్తంగా మనం పూజ చేసిన ద్రవ్యాలతో బ్రాహ్మడు ఇల్లుంతా కలియ తిరిగి ఆ ద్రవ్యాన్ని చల్లడం జరుగుతుంది. 12వ రోజు ఆశ్వీరవచనం చేస్తారు. ఆకుటుంబంలో ఎవరు చనిపోతే వారి పుట్టింటి వారి తరఫున నూతన వస్త్రాలు చనిపోయిన వారి పెద్దలకు పెట్టడం జరుగుతుంది. మరియు బ్రహ్మడు ఆశ్వీరవచనంలో ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ చెప్పడం జరుగుతుంది. తదనంతరం ఆ బాధను నుంచి మర్చిపోయేందుకు తన అక్కచెళ్లెళ్ల, అన్నదమ్ముల ఇండ్లకు వెళ్లొచ్చు. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు.. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు.

నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్య ప్రదానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు.మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు.. కొత్త పూజలు, నూతన గృహ ప్రవేశాలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే,  సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయ దర్శనం చేసువచ్చునని చెప్పబడింది.

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, వస్త్రంలో చుట్టి పక్కన పెట్టడమే పెద్ద తప్పు అని అంటున్నారు శాస్త్రం తెలిసిన పెద్దలు. అది దోషము, అరిష్టము కూడా.. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరపితే మంచిది.

ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కావున ఎల్లపుడూ దైవారాధన, దీపారాధన చేయకుండా ఉండకూడదు. దీపారధ చేస్తే ఆ ఇల్లు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటుంది.

ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కావున ఎల్లపుడూ దైవారాధన, దీపారాధన చేయకుండా ఉండకూడదు. దీపారాధన చేస్తే ఆ ఇల్లు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *