హైదరాబాద్ లో అగ్రిహబ్ ప్రారంభం

హైదరాబాద్ లో అగ్రిహబ్ ప్రారంభం
సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేయడం
ఈ స్టార్టప్‌లతో రైతులు, వ్యవసాయరంగంలో మార్పులు
వ్యవసాయానికి సాంకేతిక అవసరమని.. దీనిని ముందంజలో నిలిపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన అగ్రిహబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సర్కార్ సూచనలతో టీ హబ్‌ను ఆదర్శంగా తీసుకొని పలుస్టార్టప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిలో భాగంగానే అగ్రిహబ్‌కు వ్యవసాయ వర్సిటీ రూపకల్పన చేసింది. హైదరాబాద్ లో 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. వ్యవసాయానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు 21 స్టార్టప్‌లను గుర్తించింది ఐటీశాఖ, అయితే ఈ యూనివర్సిటీ 11 స్టార్టప్‌లకు ఆమోదం తెలిపింది.
దీనిలో భాగంగానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్‌లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతతో వ్యవసాయరంగంలో ఈ స్టార్టప్‌ల సహాయంతో మరింత ముందుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగానే రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్లద్వారా ఎరువుల పిచికారి, డ్రోన్ల ద్వారా తెగుళ్ల గుర్తింపు, ఏఐ, నీటిపారుదల యాజమన్యంపై పనిచేయనుందని అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్రిహబ్ నిర్మాణానికి నాబార్డ్ ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది. కేవలం ఏడు నెలల్లోనే అగ్రిహబ్ నిర్మాణం పూర్తయ్యింది. దీనిలో వ్యవసాయ ఆధారిత పనుల కోసం సరికొత్త ప్రయోగాలు చేసేందుకే అగ్రిహబ్ ఏర్పాటు చేయడం జరిగింది.