వ్యవసాయ పంటలపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

వ్యవసాయ పంటలపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

వ్యవసాయ పంటలపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి మరియు వానాకాలంలో రాబోయే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై  మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండే పంటలకు సంబంధించిన సమాచారం వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. పంటల సమాచారంపై 100శాతం ఖచ్చితత్వంగా ఉండాలని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేసిన గత మూడేళ్లుగా రైతుల వారీగా పంటల నమోదు ఉండేదని.. ఈ సారి పంటల వివరాలు వివరంగా నమోదు చేయాలని.. ధరణి పోర్టల్ లో సర్వే నంబర్ల వారీ మ్యాపుల ఆధారంగా పంటల నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆగస్ట్ 15 నుండి ప్రారంభమయిన పంటల నమోదుపై సర్వే చేయడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.  నూనె గింజల ఉత్పత్తులు వేరుశనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి పంటలతో పాటు పప్పు శనగను ప్రొత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులతో మమేకం కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాంచారు. ఈ దిశగా రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు కూడా పంటల మార్పిడిపై ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు విస్తృతంగా ఇప్పటి నుండే రైతులలోకి తీసుకెళ్లాలని చెప్పారు. యాసంగిలో నూనెగింజలను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు వేరుశెనగ సాగును పెంచడానికి రాయితీపై విత్తనాలను సరఫరా చేయడానికి గల అవకాశాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు.

పెరిగిన సాగు నీటి వసతుల నేపథ్యంలో ఒకే రకమైన పంటలు కాకుండా అన్నిరకాల పంటలు పండించేలా రైతులు తమ సాగు విధానాలను మార్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా FCI నుండి పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు.ఈ వానాకాలం పంటల నుండి కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని..అందులో కూడా బాయిల్డ్ ధాన్యానికి ఉపయోగించే దొడ్డు వడ్ల రకాలను కొనుగోలు చేయమని చెప్పారు. ప్రస్తుతం సన్నరకం వడ్లను మాత్రమే FCI సేకరించడం జరుగుతుందని అన్నారు. సాద్యమైనంత వరకు యాసంగిలో వరి పంటను సాగు చేయొద్దని అధికారులు రైతులకు సూచించాలని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *