అజిత్ పవార్‌ ఇంటిపై ఐటీ శాఖ దాడులు

అజిత్ పవార్‌ ఇంటిపై ఐటీ శాఖ దాడులు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదాయానికి మించి ఆస్తుల చిట్టాలను బయటపెడుతూనే ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. దీనిలో భాగంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, NCP సీనియర్ నేత అజిత్ పవార్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు చేయగా.. అజిత్ ఆస్తులకు సంబంధించిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఆదాయపు శాఖ.

ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులతో పాటుగా ముంబైలోని నారిమన్ పాయింట్‌లో గల నిర్మల్ టవర్‌ను ఐటీ శాఖ అధికారులు గుర్తించి అటాచ్ చేశారు. ఐటీ అధికారుల సోదాలలో అజిత్ పవార్ కుటుంబానికి చెందిన కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. గత నెల అజిత్ పవార్ సోదరీమణుల నివాసాలు, కంపెనీలపై ఐటీశాఖ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.184 కోట్ల మేర ఆదాయపు పన్నుకు లెక్కలకు రాని ఆదాయాన్ని గుర్తించారు. అయితే ఈ సోదాలపై అప్పట్లో అజిత్ స్పందిస్తూ తమ ఆదాయానికి సంబంధించి రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తున్నట్లు అజిత్ పవార్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తమపై కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: