దీపావళి కానుకగా బాలయ్య అఖండ అప్ డేట్

బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం అఖండ. మాస్ మసాలా చిత్రాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను. “అఖండ”. చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ చాలా ఢిఫ్రెంట్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తేనే అర్ధమవుతుంది. దీంతో పాటు ఈ చిత్రంలో సన్నివేశాలు అభిమానులకు చాలా ఊరట కలిగిస్తాయట.

అయితే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తియిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ తెలిపింది. అయితే నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు ఫిల్మిం మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా నందమూరి బాలయ్య అభిమానులు మెచ్చే అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ నవంబర్ 8న విడుదల కానుంది.

అఘోరి పాత్రలో  “అఖండ చిత్రం”లో బాలకృష్ణ కనిపిస్తారు. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, ప్రధాన పాత్రలో  జగపతి బాబు, పూర్ణ, శ్రీకాంత్ నటిస్తున్నారు.

కాగా, సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం “అఖండ”. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీగా సి.రామ్ ప్రసాద్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి డైలాగ్స్ ఎం. రత్నం అందించగా…నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెర కెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ని నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *