తానే వండి.. గరిట పట్టి వడ్డించిన అమరీందర్ సింగ్

తానే వండి.. గరిట పట్టి వడ్డించిన అమరీందర్ సింగ్

ఒలింపిక్ వీరుల కోసం తానే వండి.. గరిట పట్టి వడ్డించిన పంజాబ్ సీఎం

మొహాలీలో ఫామ్ హోస్ లో విందు ఏర్పాటు

బంగారు విజేత నీరజ్ చోప్రా సహా పలువురు హాజరు

తన వంటకాలతో అదరగొట్టిన పంజాబ్ సీఎం

రాష్ట్ర రాజకీయాలతో ఎప్పుడు బిజిగా ఉండే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.. అప్పుడప్పుడు గరిటె పడతారట. అయితే తానే స్వయంగా వంట చేసి అతిథులకు వడ్డించారండోయ్.. ఇది నిజమేనా అనుకుంటున్నారా.. చదవండి.. చూడండి..

టోక్యో ఒలింపిక్స్ లో పంజాబ్ నుంచి ప్రాతనిధ్యం వహించి పతకాలు గెలిచిన విజేతలు బంగారు విజేత నీరజ్ చోప్రాతో పాటుగా పురుష, మహిళా హాకీ  ప్లేయర్లు, అథ్లెట్లు పాల్గొన్నారు. మొహాలీలోని తన ఫామ్ హౌస్‎లో ఆయన డిన్నర్ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు వండడం మొదలు పెడితే… సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశానని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి నిమిషాన్నితాను ఆశ్వాదించానని పేర్కోన్నారు. దేశాని పేరు ప్రఖ్యాత్యలు తీసుకొచ్చే క్రీడాకారులు ఎంతగానో శ్రమిస్తారని.. ఆ క్రీడాకారుల ముందు తాను పడ్డ కష్టం చాలా తక్కువని అన్నారు.

మటన్ ఖాడా పిషోరీ, లౌంగ్ ఇలాచీ చికెన్, ఆలూ కుర్మా, దాల్ మస్రి, చికెన్ కుర్మా, దుగని బిర్యానీ, జర్దా రైస్ లాంటి పంజాబీ సంప్రదాయ వంటకాలను తయారు చేశారు. అతిథులందరికీ స్వయంగా దగ్గరుండి అందరికీ ఆయనే వడ్డించారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: