సిద్దిపేట మహిళలకు మాత్రమే..ఆ పోస్టులు భర్తీకి ఆహ్వానం

సిద్దిపేట మహిళలకు మాత్రమే..ఆ పోస్టులు భర్తీకి ఆహ్వానం

సిద్దిపేట మహిళలకు మాత్రమే..ఆ పోస్టులు భర్తీకి ఆహ్వానం

సిద్దిపేట జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరణకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉన్నట్లు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 22 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 9 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, 95 ఆయా పోస్టులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అయితే దరఖాస్తు దారులు తప్పనిసరిగా 10వ తరగతితో పాసై ఉండాలని, అంతేగాకుండా.. స్థానిక గ్రామస్తులే అప్లై చేయాలని… అభ్యర్థుల వయస్సు జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 ఏళ్లు మించకుండా ఉండాలని తెలిపారు.

అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు. అభ్యర్థులు 10వ తరగతి మెమో, కుల ధృవీకరణ పత్రం, లోకల్ ఏరియా పత్రములు దరఖాస్తు దారు దివ్యాంగులు, అనాథ, వితంతువు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రములు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి వెబ్ సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mis.tgwdcw.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తు ఆఖరి గడువు తేదీ ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *