దేశంలోకి థర్డ్ వేవ్ వస్తోందా ? మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు – నైట్ కర్ఫ్యూలు తప్పదా ?

దేశంలోకి థర్డ్ వేవ్ వస్తోందా ? మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు – నైట్ కర్ఫ్యూలు తప్పదా ?

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం చూస్తుంటే… థర్డ్ వేవ్ కి ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. మరో రెండు నెలల్లో థర్డ్ వచ్చే ఛాన్సుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ ఇప్పటి దాకా 77 దేశాల్లో ఎంటర్ అయింది. ఇటు మన దేశంలో 65 కేసులు దాకా రికార్డవగా… ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 28 కేసులు ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 11 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు బయటపడటం కలవరం కలిగిస్తోంది.

తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్ లోకి ఒమిక్రాన్ ఎంటర్ అయింది. ఇదే కాకుండా… రెండు రాష్ట్రాల్లోనూ గతం కంటే కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకి వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులు గుమికూడి ఉండటంతో… వీటిల్లోనే కేసులు పెరుగుతున్నాయి. చాలామటుకు గురుకుల స్కూళ్ళు, ప్రభుత్వ బడుల్లో సరైన కోవిడ్ రూల్స్ పాటించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం అవసరమైన మాస్కులు, శానిటైజర్లు సప్లయ్ చేయడం లేదు.

ఒక్క స్కూళ్ళల్లోనే కాదు… ఏరియాలవారీగా కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. చాలామంది సెకండ్ వేవ్ తర్వాత మాస్కులు పెట్టుకోవడం మానేశారు. దానికి తోడు రెండు టీకాలు వేసుకున్న వారిలో మరింత ధీమా పెరిగింది… తమకు ఇక కరోనా రాదన్న ఆలోచనలో ఉన్నారు. కానీ టీకా అనేది 6 నుంచి 9 నెలల వరకే సపోర్ట్ చేస్తుందనీ… తర్వాత బాడీలో ఇమ్యూనిటీ లేకపోతే మళ్ళీ కరోనా ఎటాక్ చేసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా… చాలామంది పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే మాస్కులు పెట్టుకోకుండా తిరగడమే కాకుండా… రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో కరోనా వైరస్ మరింత SPREAD అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒమిక్రాన్ డేంజరే… లైట్ తీసుకోవద్దు: WHO

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డేంజర్… దానిని తక్కువగా అంచనా వేయవద్దు అంటోంది WHO. గతంలో వణికించిన డెల్టా వేరియంట్ తో పోలిస్తే స్పీడ్ గా SPREAD అవుతోందని WHO హెచ్చరిస్తోంది. కేసుల సంఖ్య కూడా భారీగా ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒమిక్రాన్ పై ఇప్పుడు అమల్లో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉందని World Health Organisation హెచ్చరిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఒమిక్రాన్ సోకుతోంది… బూస్టర్ డోస్ వేసుకుంటోనే కాస్తంత రక్షణ లభించే ఛాన్సుందని అంటున్నారు WHO ప్రతినిధులు. ఒమిక్రాన్ పై టీకాలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయన్నది తెలుసుకోవాలంటే ఇంకా ప్రయోగాలు జరగాలి అంటున్నారు.

మళ్ళీ కంటైన్ మెంట్ జోన్లు

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ కంటైన్ మెంట్ జోన్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో లాగా ఆ ఏరియాల నుంచి జనాన్ని బయటకు రాకుండా ఆంక్షలు విధించడం, కంచెలు ఏర్పాటు చేయడం లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చే ఛాన్సుంది. అలాంటి ఏరియాల్లో అవసరమైతే నైట్ కర్ఫ్యూ కూడా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.

మాస్క్ మస్ట్

కరోనా వేరియంట్ మరింత విస్తరించకుండా అందరూ మాస్కులు ధరించాలి. శానిటైజర్ల వాడకం పెంచాలి. తరుచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఉన్నా… ఆఫీసులు లేదా బయట ఫీల్డ్ మీద తిరుగుతున్న పెద్దలు ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో లాగే ఇంటికి రాగానే బట్టలన్నీ విప్పి సర్ఫ్ తో ఉన్న వేడి నీళ్ళల్లో వేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావాలి… అలాగే ఎవరికైనా సర్ది చేసినా (జలుబు), జ్వరంగా ఉన్నా… ముందుగా ఐసోలేట్ అవడం బెటర్. తర్వాత పరిస్థితిని బట్టి టెస్టులు చేయించుకోవచ్చు.

ఇవన్నీ పాటిస్తేనే థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.  ఇప్పటికే మొదటి, రెండో వేవ్స్ తో మన ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళని చాలామందిని పోగొట్టుకున్నాం.  ఇప్పటికైనా మళ్ళీ జాగ్రత్తలు తీసుకోకపోతే మరో ముప్పు తప్పకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *