APలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ బదిలీలు

APలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ బదిలీలకు సీఎం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లోని రెండేళ్లు సర్వీస్ పూర్తైన డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సాధారణ బదిలీలకు అంగీకారం తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా ఐదేళ్లు సర్వీస్ ఒకే చోట పూర్తైన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 2023 జూన్ 30లోగా పదవి విరమణ పొందే లెక్చరర్స్ కు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. దీనికి సంబంధిత ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆయా శాఖను ఆదేశించారు.