ఇవాళ ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు
ఇవాళ ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో TDP కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు తెగబడ్డారు. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు సహకరించడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్రజలు, టీడీపీ నేతలంతా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. అందుకే నేను కేంద్రమంత్రికి ఫోన్ చేశానని తెలిపారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దూమారం లేపాయి. టీడీపీ నేత పట్టాబి ఇంటిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఏపీలో వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీలో టీడీపీ నేతలు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. విజయవాడ, అమరావతి, విశాఖ, తిరుపతి, ఒంగోలులో నిరసనలకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.