AP: ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల

AP: ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించింది. విద్యార్థులు https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com’’ ద్వారా లేదా 391282578 వాట్సాప్ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.