ఏపీలోని ఆ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలోని ఆ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలోని ఆ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(NHM)వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.  అర్హతలను బట్టి వేతనాలు ఇలా ఉన్నాయి.

APలోని NHM 858 ఖాళీలు
ఏపీలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(NHM)కింద  వివిధ జిల్లాల DMHOల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

శాఖల వారిగా ఉన్న పోస్టులు: 858
స్టాఫ్‌ నర్సులు–324, మెడికల్‌ ఆఫీసర్లు–308, వైద్య విభాగంలో స్పెషలిస్ట్ లు–53, ల్యాబ్‌ టెక్నీషియన్లు–14, పారామెడికల్‌ స్టాఫ్‌–90, కన్సల్టెంట్‌–13, సపోర్ట్‌ స్టాఫ్‌–56.

కావాల్సిన అర్హతలు: వైద్య విభాగంలో ఆయా పోస్టులను అనుసరించి టెన్త్, GNM/BSC(నర్సింగ్‌), DML/TMLC/BSC(MLT), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, BMSW/ఎంఏ(మాస్టర్ ఆఫ్ సోషల్‌ వర్క్‌), MBBS, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతం: ఆయా పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ఆయా జిల్లాల్లోని DMHOలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *