APEPDCL లో 398 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APEPDCL 398 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
జూనియర్ లైన్ మెన్ జాబ్స్
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖలో ఈస్ట్ ర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాలు గ్రామ వార్డు, వివిధ సచివాలయాల్లో పనిచేయడానికి 398 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. అభ్యర్థులు https://apeasternpower.com/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చునని తెలిపారు.
టెన్త్ పాస్ తో పాటుగా ITI లో ఎలక్ట్రికల్, వైర్ మెన్ ట్రేడ్ క్వాలిఫై అయిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చునని.. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apeasternpower.com/ లో చూడొచ్చునని తెలిపింది.