పండుగలకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్

పండుగలకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్

క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీసీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఆర్టీసీ  వినియోగించుకోవాలని 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల బస్సు సర్వీసుల్లో ఈ అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సదుపాయాన్ని కల్పించామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) కేఎస్‌బీ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య తిరిగే అన్ని దూరప్రాంత బస్సుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా మేలు జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *