15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

8 నుంచి 10 రోజులు బడ్జెట్ సమావేశాలుండే ఛాన్స్

సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తరువాతే నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6 నెలలకోసారి కావాల్సి ఉన్న దృష్ట్యా సెప్టెంబర్ 26 లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కరోనా మహమ్మారితో ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి అవి సాధ్యపడలేదు.

అయితే ఈ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలను పరిస్థితులను బట్టి 8 నుంచి 10 రోజులపాటు కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించి, ఎన్నిరోజులు సమావేశాలు జరపాలన్న దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *