ATM లలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా.. RBI నిర్ణయం

ATM లలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా.. RBI నిర్ణయం

ATM లలో నగదు లేకపోతే జరిమానా.. RBI నిర్ణయం

ఏటీఎంలో నుంచి నగదు డ్రా చేసుకొనే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తాజాగా రిజర్వు బ్యాంక్  ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయా ఏటీఎంలలో నగదు లేకపోతే.. నెలలో 10 గంటలు దాటితే.. ఆయా బ్యాంకులకు రూ.10వేల చొప్పున ఫైన్ విధించనున్నట్లు RBI వెల్లడించింది. అయితే ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని తెలియజేసింది. ఈ నిబంధన ప్రకారం ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే ఆయా శాఖ ఏటీఎంలు నగదు నింపకపోయినట్లయితే ఫైన్ తప్పని సరి తెలిపింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతోనే తమ దృష్టికి వస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని RBI తెలిపింది. ఏటీఎంలలో నగదు పెట్టే ఏజేన్సీలు, బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (WLA) ఆపరేటర్లు కూడా ఈ నిబంధన తప్పని సరి. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్బీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *