ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అలంకారం

ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అలంకారం

ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అలంకారం

బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం. ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన మరింత చేస్తారు.

ఈ శోక్లాన్ని జపించడండి

మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ విశ్వశ్రీః విశ్వమంగళమ్‌

షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌

జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ లోకం సద్బుద్ధి సుందరమ్‌

పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనమ్‌

భంఢపుత్ర వదోద్యుక్త బాలా విక్రమ నందిత

9 రోజులు కూడా అమ్మవారి పూజ చేసే వారు నేలపైనే పడుకోవాలి.

అమ్మవారి చీర: గులాబిరంగు చీరలో అమ్మ దర్శనమిస్తుంది.

నైవేద్యం: కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి
తయారీ విధానం: నెయ్యి , పెసరపప్పు, జీలకర, మిరియాలు, బియ్యంతో కలిపి తయారు చేసిన అన్నం బలాన్నిస్తుంది.

దీని వల్ల ఉపయోగాలు: శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్టిస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.

“హ్రీంకారాసన గర్భితానల శిఖాం

సౌ:క్లీం కళాంబిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం

త్రినేత్రోజ్జ్వలామ్

వందే పుస్తక పాశమంకుశధరాం

స్రగ్భూషితాముజ్జ్వలాం

తాంగౌరీం త్రిపురాం

పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్”

బాలా త్రిపుర సుందరి కథ: త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు , బుద్ధి , చిత్తం., అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయని వేదాల్లో వల్లించబడ్డాయి.

బాలా త్రిపురి సుందరీ అమ్మవారు.. అభయ హస్త ముద్రతో.. అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్యం సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవతగా చెప్పబడుతోంది.

షొడశ విద్యకు ఈమె అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము అని వేదాలలో చెప్పబడ్డాయి.

త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్యా వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.. అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు.. ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు

జాగృత్త్ , స్వప్న , సుషుప్తి !

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత !

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని.. ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాగా అమ్మవారు ఆనందింపచేస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన , ఈ మూడు అవస్థలులోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే దాగి ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తున్నది.

బాలా త్రిపుర సుందరి కథ:  

భండాసురునియొక్క పుత్రులు ముప్ఫైమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం.ఆ ఒక్క తల్లి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పుత్రులు. వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లియొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామందిచేత ఆరాధింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం. బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా ! తొమ్మిది రోజులు చేయాలా ? అంటే చేయాలట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.

రెండవ రోజు బాల పూజా ఫలితం – “శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై” అన్నారు. – శతృనాశనము , ధనాన్ని , ఆయుష్షునీ , బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటిరోజు చేసే కుమారీపూజయొక్క ఫలం.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం

అరుణకిరణ జాలైః అంచితావకాశా

విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా

ఇతర కర వరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థా

నివసతు హృది బాలా నిత్య కళ్యాణ శీలా

(ఎర్రని కిరణాలను వెదజల్లుతూ  జపమాల , పుస్తకము , వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ  విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక)

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే

కామేశ్వర్యై చ ధీమహి

తన్నోబాలా ప్రచోదయాత్ ||

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

ఇతి శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావలీ సంపూర్ణంగా చెప్పబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *