నందమూరి బాలకృష్ణకి సర్జరీ
గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గత నెల 31న చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీరా రెడ్డిని సంప్రదించగా సర్జరీ అవసరమని ఆయనకు తెలిపారు.
డాక్టర్ రఘువీరా రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్‌లు వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు.
బాలకృష్ణ కుడి చేయి ఎత్తడం కూడా కష్టంగా ఉండడం.. విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్న కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపిన డాక్టర్లు. దీంతో ఆయన అభిమానులు లెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరము లేదని డాక్టర్లు తెలిపారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో సందడి చేస్తున్నబాలయ్య.. మరో పక్క “ అఖండ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెరపైకి ఎక్కనుంది.