బాలయ్య అఖండ మూవీ సెన్సార్ పూర్తి
బోయపాటి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. అఖండ మూవీలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతారాల్లో చూపించాడు డైరెక్టర్ బోయపాటి.
ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఏమిటంటే.. సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ మూవీని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ‘అఖండ’చిత్రానికి U/A సర్టిఫికేట్ ను జారీ చేశారు. అఖండ మూవీ సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతున్నారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుస్తోంది. ఈ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా జగపతిబాబు, నటి పూర్ణ కీలక పాత్ర వహిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో ఎవరూ ఊహించని విధంగా తనతైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించనున్నాడు. ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Censor formalities done with U/A 🥁🔥
Unstoppable #Akhanda 🦁 Roaring to release on 2nd Dec!
🔗 https://t.co/I7x6lQWV1p#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/4JsVhPR0FU
— Dwaraka Creations (@dwarakacreation) November 21, 2021