బాలయ్య మజాకా… ఆహా ప్రోమో విడుదల

బాలయ్య మజాకా… ఆహా ప్రోమో విడుదల

తెలుగువారి ఫేవరెట్ ప్రముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ‘ఆహా’లో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు మొట్టమొదటిసారిగా హోస్ట్ గా మాస్ లో ఫోలోయింగ్ ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ హాజరయ్యారు.తొలిసారిగా బాల కృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అని నామకరణం చేశారు. ఈ ఓటీటీ ఒరిజినల్ కు సంబంధించిన లాంచింగ్ వేడుక దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కలుద్దాం… హ..హ…హ ఆహాలో అన్నప్రోమోలో బాలకృష్ణ డైలాగ్ చెప్పారు.

ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ్య నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న ‘ఆహా’ ఓటీటీలో మొదలు కానుంది. అయితే కథ నచ్చితే ఓటిటిలో ఎంట్రీ ఇస్తానని అని చెప్పిన బాలయ్య..ఇప్పటి వరకు ఎన్నో టాక్ షోలు వచ్చాయి.వాటితో బాలయ్య షోకు ఏంటి తేడా అంటూ చాలా మంది అడుగుతున్నారు.

బిజినెస్ యాంగిల్ లో చూసినా బాలకృష్ణ వంటి మాస్ హీరో వచ్చి, ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం నిర్వహిస్తే వచ్చే ఆ లాభమే వేరని నెటిజన్లు అంటున్నారు ఇప్పటి వరకు బాలయ్య బుల్లితెరపై ఏలాంటి షో లు  నిర్వహించలేదు. దాంతో బాలయ్య తొలిసారి చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు జనాల్లో ఓ స్పెషల్ క్రేజ్ వస్తుందని అనుకోవడం సహజమే కదా! అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, అల్లు రామలింగయ్య ఫ్యామిలీకి ఏ నాటి నుంచో మంచి అనుబంధం ఉంది.

అల్లు అరవింద్, బాలయ్యకు చిన్ననాటి మిత్రుడు. సో దీంతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోకు అంగీకరించి ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. బిజినెస్ యాంగిల్ లో అల్లు బిజినెస్ స్ట్రాటజీ పనిచేస్తుందని కొందరు చెబుతున్నారు.

ఎన్టీఆర్ నెలకొల్పిన ‘తెలుగుదేశం’ పార్టీతోనే.. తెలంగాణ సీఎం కెసీఆర్ కొత్త పార్టీ నిర్వహించి పై స్థాయికి ఎదిగారని…గతంలో టీటీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రి పదవినీ నిర్వహించారు.ఆ విధంగా కేసీఆర్ తోనూ బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది.

మైహోమ్ రామేశ్వరరావుకు చెందిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్. భవిష్యత్ లో  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మరింత క్రేజ్ సంపాదించి పెడుతుందని భావించవచ్చు. ఒక వేళ బాలయ్య అరవింద్ ను చూసి ఈ ప్రోగ్రామ్ అంగీకరించినా, లేక రామేశ్వరరావు వల్ల ఒప్పుకున్నా బాలయ్య.. స్నేహాతులకు ఇచ్చే విలువ ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.

ఈ ప్రోగ్రామ్ ను 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఎపిసోడ్ కోసం బాలయ్య 50 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే 6 కోట్ల వరకు బాలయ్య రెమ్యునరేషన్ అందుకోన్నట్లు తెలుస్తుంది. సినిమాల్లో తనేంటో నిరూపించుకున్న బాలయ్య Unstoppable తో యాంకర్‌గా ఎంతవరకు సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *