బంగార్రాజు.. కృతిశెట్టి అందాలు చూడండి..

కల్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఈ మూవీలో కింగ్ నాగార్జున, తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగార్జున సరసన సీనియర్ నటి రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటీంగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బంగార్రాజు సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా కృతి శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌ ను హీరో నాగచైతన్య ఆవిష్కరించారు.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.

కృతి శెట్టి లుక్ పై స్పందిస్తూ ‘బాగుంది. “బంగార్రాజు” లుక్‌ ఏది? అంటూ నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానంగా చై ‘లేడీస్ ఫస్ట్’ అంటూ చమత్కరించారు. “కృతి శెట్టిని మా నాగలక్ష్మిగా పరిచయం చేస్తున్నా.. ఫస్ట్ లుక్ ఇదిగో’’ అని నాగ చైతన్య ట్వీట్ చేశారు.

‘బంగార్రాజు’లో తన లుక్ పై కృతి శెట్టి స్పందిస్తూ “పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నాగ చైతన్య. నాగ లక్ష్మి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది !!!” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మూవీలో చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *